హైదరాబాద్ మియాపూర్ లో ఘోరం.. బైక్ పై వెళ్తూ కిందపడి.. ఒకరు మృతి

హైదరాబాద్ మియాపూర్ లో ఘోరం.. బైక్ పై వెళ్తూ కిందపడి.. ఒకరు మృతి

హైదరాబాద్ లోని మియాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మంగళవారం ( మే 20 ) జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హఫీజ్ పేట్ నుండి మియాపూర్ కు బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి కిందపడటంతో బైక్ పై వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | జస్ట్ మిస్.. అలర్ట్గా లేకపోయి ఉంటే.. లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది..!

ఈ ఘటనపై కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. బాధితుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో మియాపూర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని.. ప్రమాదాలు అరికట్టే దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.