జస్ట్ మిస్.. అలర్ట్గా లేకపోయి ఉంటే.. లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది..!

జస్ట్ మిస్.. అలర్ట్గా లేకపోయి ఉంటే.. లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది..!

కేరళలో ఒక మహిళను చావు పలకరించి ఆమె పక్క నుంచి వెళ్లిపోయింది. ఆమె అప్రమత్తతే ఆమెను కాపాడింది. కోజికోడ్ మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే.. కోజికోడ్ మెడికల్ కాలేజ్ సమీపంలోని రోడ్డుపై సిమెంట్ ఇటుకల లోడ్తో ఒక లారీ వెళుతోంది.

ఆ లారీ వెనుకే ఒక మహిళ స్కూటీపై వెళుతుంది. ఆ రోడ్డు డౌన్ నుంచి వెళుతున్న లారీ అప్ ఎక్కలేక వెనుకకు వస్తుండగా ఆ లారీ వెనుక స్కూటీపై ఉన్న మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. రోడ్డు డౌన్ ఉండటంతో లారీ అదుపు తప్పి వెనుకకు దూసుకొచ్చింది. ఆ మహిళ స్కూటీని వదిలేసి పక్కకు పడిపోవడంతో లారీ చక్రాల కింద స్కూటీ తుక్కుతుక్కయిపోయింది.

ALSO READ | Bengaluru Rains: బెంగళూరు వరదల్లో 5 మంది మృతి.. జల దిగ్బంధంతో రోడ్లపై బోట్ల ప్రయాణం..

పొరపాటున ఆమె అదే స్కూటీపై ఉండి ఉంటే లారీ టైర్ల కింద ఆమె కాళ్లు, దేహం నుజ్జునుజ్జయి ఉండేది. స్కూటీ పోతే మళ్లీ కొనుక్కోవచ్చు గానీ ప్రాణం పోతే తిరిగి రాదని ఆ మహిళ పక్కకు పడిపోయి మంచి పని చేసింది. ఆమె అప్రమత్తతే ఆమెను కాపాడింది. లారీ స్కూటీపై నుంచి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై బైక్ లేదా స్కూటీ నడుపుతున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన చెప్పకనే చెప్పింది.