Bengaluru Rains: బెంగళూరు వరదల్లో 5 మంది మృతి.. జల దిగ్బంధంతో రోడ్లపై బోట్ల ప్రయాణం..

Bengaluru Rains: బెంగళూరు వరదల్లో 5 మంది మృతి..   జల దిగ్బంధంతో రోడ్లపై బోట్ల ప్రయాణం..

Bengaluru Rain Deaths: కొన్ని గంటల్లో భారీగా కురిసిన వాన బెంగళూరు నగరాన్ని జలదిగ్భందం చేసింది. దీంతో నగరంలో ఏ వీధిలో చూసినా నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలను బోట్లలో రెస్కూ టీమ్స్ తరలిస్తున్నాయి. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షాలకు చనిపోయిన వారి సంఖ్య 5కి చేరింది. వీరిలో ఇద్దరు ఎలక్ట్రోక్యూటింగ్ కారణంగా మరణించగా.. ఒకరు గోడ కూలిన ప్రమాదంలో మరణించారని వెల్లడైంది. 

 

భారీగా కురిసిన వర్షంతో బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్, సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్, శాంతి నగర్, కంతీరవ స్టేడియం సహా మరిన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం ఐటీ నగరం వర్షంలో మునిగిన స్టేడియంలా మారిపోయిందని ప్రజలు అంటున్నారు. నగరంలోని ఇన్ ఫ్రా ఎంత దారుణంగా ఉందనే విషయం ఒక్క వర్షంతో బయటపడిందని నెటిజన్లు అంటున్నారు. గురుగ్రామ్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వారు అంటున్నారు. పైకి చూడటానికి నగరం అందంగా కనిపిస్తోందని డొల్లతనాన్ని వర్షం బయటపెట్టిందని అంటున్నారు.

 

మరో నెటిజన్ స్పందిస్తూ తాను ప్రభుత్వానికి పన్నులు కడుతూ ఎలాంటి ఉచితాలను పొందటం లేదని అన్నాడు. అయితే తాను కోరుకుంటోంది వారి నుంచి కేవలం వర్షంలో మునిగిపోని నగరాన్నే అని అన్నాడు. కనీసం వర్షాకాలం ప్రారంభం అయ్యేనాటికి వీటిని అధికారులు చక్కదిద్దాలని కోరుతున్నట్లు ఎక్స్ పోస్టులో వెల్లడించాడు. అనేక చోట్ల ప్రజల ఇళ్లలో నీళ్లు నిలిచిపోవటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే వరద సహాయక చర్యలపై డిప్యూటి సీఎం డికె శివకుమార్ స్పందించారు. నగర మున్సిపల్ అధికారులు వేగంగా చర్యలు చేపట్టి నగరంలో సాధారణ పరిస్థితులకు కృషిచేస్తున్నారన్నారు. 210 వదర ప్రాంతాల్లో దాదాపు 70  శాతం చోట్ల పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారని, మిగిలిన 30 శాతం చోట్ల కూడా చర్యలు త్వరలో చేపట్టడానికి వారు శ్రమిస్తున్నారని అన్నారు. మెుత్తానికి బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. రోజువారీ జీవితం స్థంభించటంతో మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచే పనిచేసేందుకు తమ కంపెనీలను రిక్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలని శివకుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు.