కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ నిబంధనలు ఇవాళ్టి నుంచి (ఆగస్టు 18) అమలులోకి వచ్చాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు పోలీసులు. రాంగ్ రూట్ వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాసబ్ ట్యాంక్ టు హైటెక్ సిటీ రూట్ లో.. ఎప్పట్లాగే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.
వన్ వే ట్రాఫిక్ అమలుతో సీవీఆర్ న్యూస్ , జర్నలిస్టు కాలనీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్ వైపు, రోడు నెంబర్ 45 వైపు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రద్దీ పెరిగింది. వాహనాలు మెల్లగా కదులుతుండటంతో ఆఫీస్ టైమ్ దాటి పోతుందని వాహనదారులు టెన్షన్ కు గురవుతున్నారు.
రోడ్డు నెంబర్ 12, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బసవతారకం హాస్పిటల్, అగ్రసేన్ జంక్షన్ నుంచి వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగుతోంది. ఆఫీస్ ల సమయం కావడంతో ట్రాఫిక్ మరింతగా పెరుగుతోంది.
