హాంకాంగ్​లో మళ్లీ హింస

హాంకాంగ్​లో మళ్లీ హింస

హాంకాంగ్హాంకాంగ్​లో మళ్లీ హింస చెలరేగింది. జనం రెండు వర్గాలుగా విడిపోయి స్ట్రీట్​ ఫైట్​కు దిగారు. ఓ షాపింగ్​ మాల్​లో విధ్వంసం సృష్టించారు. ప్రో–డెమోక్రసీ సపోర్టర్లు ప్రత్యేక గీతంతో నిరసనలు తెలుపుతుంటే.. ప్రో–-బీజింగ్​ మద్దతుదారులు చైనా జాతీయ గీతంతో వారికి కౌంటర్ ఇస్తున్నారు. బీజింగ్​ సపోర్టర్లు చైనా జెండాలు పట్టుకుని ప్రత్యర్థులపై దాడులకు దిగారు. హాంకాంగ్​లో కొద్ది నెలలుగా ప్రో‌‌‌‌-–డెమోక్రసీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిత్యం భారీ ర్యాలీలతో హోరెత్తుతుంది. పోలీసులతో ఆందోళనకారులు హోరాహోరీ తలపడుతున్నారు. హాంకాంగ్​లో తాజా పరిస్థితులు చైనాకు సవాల్​గా మారాయి. 1997లో  హాంకాంగ్‌‌ను బ్రిటన్​ చైనాకు అప్పగించిన తర్వాత ఈ స్థాయి హింసాత్మక ఘటనలు చెలరేగడం ఇదే తొలిసారి.

శనివారం ఫోర్ట్రెస్​ హిల్​ డిస్ట్రిక్ట్ లో చైనా జెండాలు పట్టుకుని, బ్లూ టీషర్టులు వేసుకున్న మూక ‘‘ఐ లవ్​ హాంకాంగ్​ పోలీస్”అని నినాదాలు చేస్తూ ప్రో-–డెమోక్రసీ ప్రొటెస్టర్లపై దాడికి పాల్పడింది. వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ.. కాలితో తన్నుతున్న వీడియోలను కొందరు ఆన్​లైన్​లో పోస్ట్​ చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రో-–డెమోక్రసీ సపోర్టర్లు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలపై హాంకాంగ్​ పోలీసులు స్పందించేందుకు నిరాకరించారు. ప్రో-–డెమోక్రసీ మద్దతుదారులు సిటీలో తమ నినాదాలు, డిమాండ్లతో ఏర్పాటు చేసిన లెనిన్​ వాల్​ను కూడా ప్రో–-చైనా సపోర్టర్లు కూల్చేశారు. ఆ తర్వాత అమోయ్​ ప్లాజాలో ప్రో–-చైనా, ప్రో-–డెమోక్రసీ సపోర్టర్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. సుమారు రెండు వందల మంది చైనా జెండాలు పట్టుకుని, చైనా జాతీయ గీతం పాడుతూ అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రో-–డెమోక్రసీ మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రో-–చైనా సపోర్టర్లకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ప్రో-–డెమోక్రసీ మద్దతుదారులు ఆరోపించారు. ఆదివారం కూడా భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రో-–డెమోక్రసీ మద్దతుదారులు ప్లాన్​ చేశారు. అయితే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వచ్చే రెండు వీకెండ్లలోనూ నిరసన ర్యాలీలు చేపట్టాలని ఆందోళనకారులు నిర్ణయించారు. అక్టోబర్​ మొదట్లో జనరల్​ స్ట్రైక్​ చేయాలనే ప్లాన్​లో ప్రో-–డెమోక్రసీ సపోర్టర్లు ఉన్నారు.