
ఫుజో (చైనా): మంగళవారం నుం చి ప్రారంభం కానున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ చాం పియన్ షిప్ లో ఇండియన్ స్టార్ , ఒలిం పిక్ రజత పతక విజేత సిం ధు.. రష్యా ప్లేయర్ కోత్సెకయాతో తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది ఇంత వరకూ ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయిన సిం ధు సెమీస్ లో ఒకుహర (జపాన్ )ను
ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఇక ఈ టోర్నీలో ఒలిం పిక్ చాం పియన్ మరీన్ , వరల్డ్ నంబర్ 2 యమగుచి కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు. మరో భారత స్టార్ తెలుగమ్మాయి జ వైష్ణవి తొలి పోరును చౌవాం గ్ (థాయిలాం డ్ )తో ఆడుతుంది.మెన్స్ సిం గిల్స్‌లో శ్రీకాం త్ , ప్రణయ్ లు భారత్ నుం చి బరిలో ఉన్నారు.
