మంచి ఆశయంతో చేసే..ప్రతి లక్ష్యం నెరవేరుతుంది

మంచి ఆశయంతో చేసే..ప్రతి లక్ష్యం నెరవేరుతుంది
  • చిన జీయర్ స్వామి
  • మేడిపల్లిలో తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండో ​బ్రాంచ్ ప్రారంభం

మేడిపల్లి, వెలుగు : మంచి ఆశయం, మంచి మనసుతో చేసే ప్రతి లక్ష్యం నెరవేరుతుందని త్రిదండి చిన జీయర్ స్వామి తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండో బ్రాంచ్​ను సోమవారం ఆయన ప్రారంభించారు.  చిన జీయర్​తో పాటు అయోధ్య, కేదార్​నాథ్ ​నుంచి వివిధ పీఠాల అధిపతులు, సినీ నటుడు సుమన్ హాజరై తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్​ను అభినందించారు.  25 ఏండ్లుగా బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తున్న తిరుమల కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్​మెంట్​ను ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అభినందించారు.

మంచి లక్ష్యంతో బ్రాంచ్ ను ప్రారంభించిన చైర్మన్ చంద్రశేఖర్​కు మంగళ శాసనాలు కలగాలన్నారు. బ్యాంక్ టీమ్ సైతం మంచి స్పిరిట్​తో ఉన్నారని.. కస్టమర్లతో ఈ బ్రాంచ్ అభివృద్ది చెందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు యుగంధర్ రెడ్డి, కావిడే పోచయ్య, తూంకుంట ప్రసన్న లక్ష్మి, బ్యాంక్ కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు.