న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం స్వాగతించదగ్గ పరిణామమని భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రారంభమైన ‘బ్రిక్స్’ దేశాల భద్రతా సలహాదారుల ఉన్నత స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందని దోవల్ తెలిపారు. హార్మూజ్ జలసంధి ద్వారా మళ్లీ నౌకల రాకపోకలు మొదలుకావడంతో గ్లోబల్ సప్లై చైన్‌లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయని, ముఖ్యంగా ఎరువులు, రసాయనాల కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
