బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాత జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ లకు మోస్ట్ క్యూట్ కపుల్స్ గా గుర్తింపు ఉంది. సాధారణంగా వివాహం తర్వాత బంధాలు భారంగా మారుతాయని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం తమది ఒక' సిట్యేయేషన్ షిప్' అని చెప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా తమ వైవాహిక బంధంపై ఈ కపుల్స్ షేర్ చేసిన విషయాలు ఇప్పుటు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.
మాది సిట్యుయేషన్‌షిప్ ..
లాక్‌డౌన్ సమయంలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. 2024లో గోవా వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భార్య రకుల్ గురించి జాకీ మాట్లాడుతూ.. మేము పెళ్లి చేసుకున్నప్పటికీ మా మధ్య ఉన్నది ఒక సిట్యుయేషన్‌షిప్ లాంటిదే. రకుల్ క నా గురించి అన్నీ తెలుసు. నా మాజీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా తెలుసు.. ఆమె ముందే ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడగలను అని చెప్పుకొచ్చారు. మా మధ్య ఎటువంటి ఒత్తిడి లేదు. మేము ఒకరికొకరు విధేయులమే, కానీ ఒకరి స్వేచ్ఛను మరొకరం హరించుకోము అని వివరించారు.
ఎమోషనల్ క్లారిటీ
నేను ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉంటాను. నా జీవితంలో ఉన్న వెలితిని భర్తీ చేయడానికి రకుల్ రాలేదు. తను లేకున్నా నేను హ్యాపీయే, నేను లేకున్నా తను హ్యాపీయే. కానీ ఇద్దరం కలిసి ఉంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అని జాకీ చెప్పుకొచ్చారు..అటు రకుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాకు వెకేషన్ వెళ్లాలని ఉంటే, జాకీ తీసుకువెళ్లాలని నేను వెయిట్ చేయను. నా అంతట నేనే వెళ్లగలను. మా మధ్య డిపెండెన్సీ లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది అని ఆమె స్పష్టం చేశారు.
►ALSO READ | Prabhas: 'డార్లింగ్' రీ-రిలీజ్.. సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే.?
పాత సంప్రదాయాలకు స్వస్తి
ఇప్పటికీ చాలా మంది మహిళలు భర్త షెడ్యూల్ ప్రకారం తమ జీవితాన్ని మార్చుకుంటారు. సర్ధుకుపోవాలని చూస్తారు. కానీ తమ బంధంలో అటువంటివి లేవని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. మేమిద్దరం ఈక్వల్ పార్ట్‌నర్స్. ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడం కంటే, బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండటమే మాకు ఇష్టం అని ఆమె తెలిపారు.
బంధం స్వేచ్ఛగా ఉండాలి..
మా ఇద్దరి ఆలోచనలు, విలువలు, చివరికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక్కటే. మేము ఇద్దరం హెల్తీ డైట్ పాటిస్తాము. ఆలోచనలు కలిస్తేనే బంధంలో దాపరికం ఉండదు అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చారు. బంధం అనేది బరువుగా కాకుండా, స్వేచ్ఛగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

