టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల నెలకొన్న నిశ్శబ్దాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ మరో సారి తన ' డార్లింగ్ ' చిత్రంతో చెరిపేశారు. ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్లాసిక్ ఈ లవ్ స్టోరీ విడుదలై 16 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ 'డార్లింగ్' ఫీవర్ తీసుకువచ్చింది.
సుదర్శన్ థియేటర్ వద్ద హైడ్రామా!
సుదర్శన్ థియేటర్ వద్ద హైడ్రామా!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద రీ-రిలీజ్ వేడుకలు ఒక్కసారిగా రణరంగంగా మారాయి. ఒక అభిమానిపై థియేటర్ సిబ్బంది దాడికి దిగారు. అయితే ఈ ఘర్షణపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని సీన్లు, పాటలను మేనేజ్‌మెంట్ కట్ చేసిందని వాటిని ప్రశ్నించినందుకు తమపై దాడికి దిగిందని ఆరోపిస్తూ అభిమానులు నిరసనకు దిగారు.
అయితే థియేటర్ వర్గాల కథనం ప్రకారం.. సదరు వ్యక్తి మద్యం మత్తులో మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, మిడిల్ ఫింగర్ చూపిస్తూ దూషించడం వల్లే గొడవ జరిగిందని పేర్కొన్నారు. మహిళ సిబ్బంది కూడా సదరు అభిమాని ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేస్తోంది.
What happened at #Sudarshan?
— Movies4u Official (@Movies4u_Officl) April 23, 2026
A person who came to watch #Darling4K at Sudarshan Theatre reportedly misbehaved with the staff, and in response, the staff allegedly attacked him. pic.twitter.com/tCdaYon40o
బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మ్యాజిక్
ఇటీవల అడివి శేష్ నటించిన 'డెకాయిట్', 'రాకాస' పర్వాలేదనిపించినా, పూర్తి స్థాయి ఊపు మాత్రం బాక్సాఫీస్‌కు రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో 'డార్లింగ్' రంగంలోకి దిగి రికార్డులను తిరగరాస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే తొలి రోజు ఈ చిత్రం రూ. 3 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రధాన నగరాల్లోని దాదాపు అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. 'ది రాజా సాబ్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ప్రభాస్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ రీ-రిలీజ్ నిరూపించింది.
►ALSO READ | Rajpal Yadav: 12 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. నాకు అప్సరసలాంటి భార్య దొరికింది: మనసు విప్పిన కామెడీ కింగ్
ఒక రీ-రిలీజ్ సినిమా కూడా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఇంతటి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంలో 'డార్లింగ్' మరోసారి రుజువు చేసింది. థియేటర్ల వద్ద జరిగిన అవాంఛనీయ సంఘటనలు అభిమానులను కొంత కలవరపెట్టినా, బిగ్ స్క్రీన్‌పై ప్రభాస్ క్లాసిక్ లుక్స్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఈ లోపు తన వింటేజ్ సినిమాలతోనే బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు ..

