ముద్ద చర్మ వ్యాధి కలకలం.. వంద ఆవులు మృతి

 ముద్ద చర్మ వ్యాధి కలకలం.. వంద ఆవులు మృతి

మేఘాలయలో అత్యంత అంటువ్యాధి కలిగిన ముద్ద చర్మ వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాాధి కారణంగా 100 ఆవులు చనిపోయాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పశు వైద్య ఆరోగ్య శాఖ  అధికారి  ఒకరు తెలిపారు. ఇప్పటివరకు 8,000 జంతువులకు ఈ వ్యాధి సోకినట్లుగా వెల్లడించారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటి వరకు 28,500 ఆవులకు టీకాలు వేసినట్లు అధికారి తెలిపారు. ముద్ద చర్మ వ్యాధి  సోకిన 5,884 ఆవులు వ్యాధి నుండి కోలుకున్నాయని చెప్పారు.  28,500 ఆవులకు ఈ వ్యాధి నివారణ టీకాలు ఇచ్చామని ఇందులో 2,100 ఆవులు ఈ వ్యాధి ఇన్‌ఫెక్షన్ల వివిధ దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు.

పశువులకు ప్రాణాంతకమైన  ముద్ద చర్మ వ్యాధి డిసీజ్‌ వైరస్‌ను మొదటిసారిగా 1929లో ఆఫ్రికా దేశంలోని జాంబియాలో గుర్తించారు. ఇది క్రమేపీ ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ దేశాలతోపాటు భారతదేశంలోని రాజస్తాన్‌, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలకూ వ్యాపించింది. తాజా లెక్కల ప్రకారం రాజస్తాన్‌లోనే 4.2 లక్షల పశువులు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. సుమారు 18 వేలకు పైగా పశువులు మృతి చెందాయి.  ఈ వ్యాధి ప్రధానంగా దూడలు, పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు సోకుతుంది. ఈ వైరస్‌ పశువుల నుంచి మనుషులకు సోకదు.