ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.13కోట్ల నగదు సీజ్.. అన్నీ రూ.2వేల నోట్లే..!

ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.13కోట్ల నగదు సీజ్.. అన్నీ రూ.2వేల నోట్లే..!

ప్రభుత్వ కార్యాలయంలో క్లెయిమ్ చేయని రూ. 2.31 కోట్ల నగదు, 1 కిలో బంగారు బిస్కెట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనలో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రికవరీ చేసిన నగదులో కేవలం రూ.2వేలు, రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమీషనర్ సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మే 19న రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.  ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు కనిపించింది. మే 19న రాత్రి దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్‌బోర్డులో ఓ బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగు నిండా నోట్ల కట్టలు ఉండడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అంతే కాదు ఈ బ్యాగులో బంగారు బిస్కెట్లు కూడా ఉండడంతో పోలీసులు మరింత షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు ఉన్నట్టు వారు గుర్తించారు. అనంతరం ఆ మొత్తాన్ని సీజ్‌ చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు.

ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని జైపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ శ్రీవాత్సవ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని శోధిస్తున్నామన్న ఆయన.. సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే విషయమై సమాచారం అందించామని తెలిపారు.

https://twitter.com/ANI_MP_CG_RJ/status/1659635120587026434