ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల సంఖ్య పెంపు.. గతంలో 610.. ఇప్పుడు 1400 మందికి అవకాశం

ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల సంఖ్య పెంపు.. గతంలో 610.. ఇప్పుడు 1400 మందికి అవకాశం

హైదరాబాద్, వెలుగు: విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందించే ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’, ‘మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి’ పథకాల లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. దీంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య దాదాపు 130 శాతం పెరుగనుంది.  గతంలో ఈ పథకాల ద్వారా మొత్తం 610 మంది విద్యార్థులు లబ్ధి పొందగా, ఇప్పుడు ఏటా1400 మందికి అవకాశం దక్కనుంది.

 కులాల వారీగా పరిశీలిస్తే మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో కేవలం 300 మంది బీసీ విద్యార్థులకు (బీసీలు + ఈబీసీలు) మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను ప్రభుత్వం 700కి పెంచింది. ఇందులో 500 మంది బీసీ విద్యార్థులు, 200 మంది ఈబీసీ విద్యార్థులకు కేటాయించారు. ఇప్పటికే బీసీ--– సీ, బీసీ– ఈ వర్గాలకు చెందిన500 మంది విద్యార్థులు లబ్ధి పొందుతుండగా, కొత్తగా పెంచిన సంఖ్యతో కలిపితే మొత్తం 1000 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ విధంగా బీసీ విద్యార్థుల సంఖ్య దాదాపు 133 శాతం పెరిగింది.