వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల టైం కావాలి : పాడి కౌశిక్ రెడ్డి 

వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల టైం కావాలి : పాడి కౌశిక్ రెడ్డి 
  • అసెంబ్లీ ఎథిక్స్​ కమిటీకి పాడి కౌశిక్​రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కడియం శ్రీహరిపై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గడువు కావాలని బీఆర్ఎస్​ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఎథిక్స్​ కమిటీకి ఆయన లేఖ రాశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సమయం కావాలని పేర్కొన్నారు.

ఎథిక్స్ కమిటీ ఇచ్చిన మెటీరియల్‌‌‌‌‌‌‌‌ వాల్యూమ్ ఎక్కువగా ఉందని, పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వివరణ ఇస్తానని పేర్కొన్నారు. మార్చి 29న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ పూర్తిగా లేదన్నారు. ఆ రోజు అసెంబ్లీ మొత్తం ప్రొసీడింగ్స్​‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పూర్తి వీడియో ఇవ్వాలని కోరారు. దాన్ని పరిశీలించి వివరంగా సమాధానం ఇస్తానని తెలిపారు.