ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి  : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి  : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యారంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన 'తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్' (టీజేహెచ్ఈ) వాల్యూమ్-2 సంచికను గవర్నర్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

టెక్నాలజీ, నైపుణ్యాలకు తగినట్లుగా విద్యా విధానాలను పునరుద్ధరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అకడమిక్ ఎక్సలెన్స్‌‌‌‌ను బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. ఈ నెల 26న హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించనున్న 'రీసెర్చ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్‌‌‌‌మెంట్ కాంక్లేవ్-2026' విశేషాలను చైర్మన్ బాలకిష్టారెడ్డి గవర్నర్‌‌‌‌కు వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.

గవర్నర్‌‌‌‌ను కలిసిన హార్టికల్చర్​ వర్సిటీ వీసీ 

హార్టికల్చర్​వర్సిటీ వీసీ రాజి రెడ్డి శుక్రవారం గవర్నర్‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్‌‌‌‌లో నిర్వహించనున్న హార్టికల్చర్​ వర్సిటీ కాన్వొకేషన్​కు సంబంధించిన విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉద్యాన రంగం ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి అవకాశాలు, భవిష్యత్‌‌‌‌ కార్యాచరణపై గవర్నర్‌‌‌‌కు వివరించారు. విశ్వవిద్యాలయం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, విద్యా, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల గురించి గవర్నర్‌‌‌‌కు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ భగవాన్‌‌‌‌ పాల్గొన్నారు.