హమారా ప్రసాద్పై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

హమారా ప్రసాద్పై ఓయూ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు

ఓయూ, వెలుగు: హమారా ప్రసాద్‌‌ రచించిన కల్పిత నాయకుడు పుస్తకంపై దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌‌ ప్రొఫెసర్‌‌ గాలి వినోద్‌‌కుమార్‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌‌ వ్యక్తిత్వాన్ని, ఆయన సామాజిక సేవలను కించపరిచేలా ఈ పుస్తకంలో అంశాలు ఉన్నాయని ఆరోపించారు. 

దీని వెనక ఆర్ఎస్ఎస్‌‌, బీజేపీ కుట్ర ఉందన్నారు. హమారా ప్రసాద్‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం (సెప్టెంబర్ 05) ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు.