అధికారులు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి అజారుద్దీన్ ఆదేశం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి అజారుద్దీన్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేయాలని  అధికారులను ఆ శాఖ మంత్రి అజారుద్దీన్ ఆదేశించారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తగిన గుర్తింపు, ప్రచారం లభించేలా అధికారులు పనిచేయాలన్నారు. తమ పరిధిలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని చెప్పారు