పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: దైతరీ నాయక్

పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా: దైతరీ నాయక్
  • అవార్డు వల్ల కడుపు ఎండుతోంది
  • కెనాల్ మ్యాన్ ​ఆఫ్ ఒడిశా ఆవేదన

కెంఝోర్ (ఒడిశా): ఒంటిచేత్తో గుట్టను తొలిచి, కాలువ ఏర్పాటు చేసి పత్రికలకెక్కా డు.. ప్రభుత్వం మెచ్చుకుని పద్మశ్రీతో సన్మానించింది. ఈ అవార్డుతో కష్టాలన్నీ గట్టెక్కుతాయ్ అనుకుంటే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అంతకుముందు దొరికే కూలిపని కూడా ఇప్పుడు దొరకడం లేదు. పక్కా ఇళ్లు కట్టించి ఆదుకుంటామన్న నేతలు కంటికే కనపడడంలేదు. ‘కెనాల్​ మ్యాన్ ​ఆఫ్​ ఒడిశా’గా గుర్తింపు పొందిన ఆదివాసీ రైతు దైతరీ  నాయక్ ​ఇప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక చీమ గుడ్లను తిని కాలం గడుపుతున్నారు. ఒడిశాలోని కెంఝోర్​జిల్లాకు చెందిన దైతరీ నాయక్ ​పంట పొలాలకు నీరందించేందుకు ఒక్కడే గోనసిక కొండలను తొలిచి, మూడు కిలోమీటర్ల పొడవున కాలువ ఏర్పాటు చేశాడు. దీంతో వంద ఎకరాలకు నీరు అందుతోంది. దీంతో స్థానిక గ్రామాల నుంచి దేశ రాజధాని దాకా నాయక్​ పేరు మార్మోగిం ది. సన్మానాలు జరిగాయి. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఆ తర్వాతే నాయక్ కు అసలు కష్టాలు మొదలయ్యాయి. అంతగొప్ప అవార్డు పొందిన వ్యక్తికి కూలి పని చెప్పడం మర్యాద కాదంటూ స్థానికులు నాయక్​ను పిలవడంలేదు. దీంతో తన కుటుంబం పస్తులుండాల్సి వస్తోందని, ఆకలిబాధ తట్టుకోలేక చీమ గుడ్లను తింటున్నామని నాయక్​చెప్పారు. కూలి దొరక్కుం డా చేసిన ఈ అవార్డు నాకొద్దని, దీనిని ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తానని నాయక్ ​అంటున్నారు.