వికారాబాద్, వెలుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన పద్మశ్రీ డాక్టర్ డీఆర్ కార్తికేయన్ మంగళవారం వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం నాగ్సాన్పల్లి గ్రామంలోని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని సందర్శించారు. డాక్టర్ న్యూటన్ కొండవీటి, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యూనివర్సిటీ నిర్మించాలన్న సంకల్పాన్ని అభినందించారు. వారికి అన్ని విధాలుగా సహకరించడానికి తాను ముందుంటానన్నారు.
ఈ కార్యక్రమంలో బుద్ధ సీఈవో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పులమరశెట్టి చంద్రశేఖర్ వాణి దంపతులు, క్వాంటమ్ సైంటిస్ట్ పొఫ్రెసర్ డాక్టర్ ఇట్టికర్న్ వట్టన దంపతులు, క్యూఎల్యూ మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరి రాజశేఖర్, ఫౌండింగ్ ట్రస్టీ పొట్లూరి శ్రీదేవి, క్యూఎల్యూపీఆర్వో పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
