- 25 ఏళ్ల నుంచి ఆయనతో సుదీర్ఘ అనుబంధం ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధన, ఉద్యోగులు, నిరుద్యోగుల న్యాయం కోసం చేసిన ఉద్యమంలో పద్మాచారి కీలక పాత్ర పోషించారని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉద్యమ కాలంలో ఎంప్లాయీస్ జేఏసీ, పొలిటికల్ జేఏసీలకు ఆయన మేధోబలం ఎంతో దోహదపడిందన్నారు. శనివారం అబిడ్స్‌లో జరిగిన పద్మాచారి పుట్టిన రోజు వేడుకల్లో దత్తాత్రేయ పాల్గొని మాట్లాడారు.
పద్మాచారితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. బీజేపీ నేత రామచందర్ రావు మాట్లాడుతూ, పద్మాచారి గొప్ప జాతీయవాది, మేధావి అని, హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో చట్టపరమైన పోరాటాలు చేసే ధైర్యసాహసాలు ఆయన ప్రత్యేకత అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యోగుల గొంతుకగా నిలిచారన్నారు. సెక్రటేరియెట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టు అడ్వకేట్‌గా పనిచేస్తుండటం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణారావు, సురేందర్, నర్సింగ్ రావు, రవీందర్ యాదవ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
