ఒకే ధరలో అన్ని రంగుల పెయింట్స్

ఒకే ధరలో అన్ని రంగుల పెయింట్స్

పెయింట్స్ వ్యాపారంలోకి జేఎస్‌‌డబ్ల్యూ
హైదరాబాద్‌‌ మార్కెట్‌‌లోకి ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు : అన్ని రంగుల పెయింట్స్‌‌ను ఒకే ధరకి అందుబాటులోకి తీసుకొస్తూ… ఇండియాలోని లీడింగ్ వ్యాపార సంస్థ జేఎస్‌‌డబ్ల్యూ తన పెయింట్స్ వ్యాపారాలను హైదరాబాద్‌‌లో ప్రవేశపెట్టింది. 8 కోర్ ప్రొడక్ట్స్‌‌లో మూడు బ్రాండ్స్‌‌ను జేఎస్‌‌డబ్ల్యూ పెయింట్స్ మార్కెట్‌‌లోకి అందుబాటులో తెచ్చింది. హెలో, పిక్సా, ఆరస్ అనేవి దీని బ్రాండ్స్. జేఎస్‌‌డబ్ల్యూ పెయింట్స్ బేస్ ధర లీటరుకు రూ.100 నుంచి రూ.150 మధ్యలో ఉండగా.. లగ్జరీ రేంజ్ పెయింట్స్ ధర రూ.450 నుంచి రూ.500 వరకు ఉంది.  హైదరాబాద్‌‌ మార్కెట్‌‌లోకి వంద మంది డీలర్స్‌‌తో ప్రవేశించామని, వచ్చే మూడేళ్లలో 200 నుంచి 300 మంది డీలర్స్‌‌ను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జేఎస్‌‌డబ్ల్యూ పెయింట్స్ జాయింట్ ఎండీ, సీఈవో ఏఎస్ సుందర్‌‌‌‌సేన్ చెప్పారు.

వచ్చే మూడేళ్లలో తమ రెవెన్యూ టార్గెట్‌‌ రూ.2 వేల కోట్లుగా నిర్దేశించుకున్నట్టు పేర్కొన్నారు. మొత్తం రెవెన్యూల్లో  50 శాతం ఏపీ, తెలంగాణ నుంచి అంచనావేస్తున్నామని తెలిపారు. వచ్చే వారం విజయవాడలో కూడా తమ పెయింట్స్‌‌ను లాంచ్ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం పెయింట్స్ ఇండస్ట్రి రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు ఉందని, వచ్చే మూడేళ్లలో 5 శాతం, వచ్చే ఐదేళ్లలో పది శాతం మార్కెట్ షేరును సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సుందర్‌‌‌‌సేన్ తెలిపారు. సౌత్, వెస్ట్ మార్కెట్లలో ఇప్పటికే లాంచ్ చేశామని తెలిపారు.