V6 News

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌కు హఫీజ్‌‌‌‌ గుడ్‌‌‌‌బై

క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌కు హఫీజ్‌‌‌‌ గుడ్‌‌‌‌బై

లాహోర్‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌ వెటరన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ హఫీజ్‌‌‌‌.. రెండు దశాబ్దాల ఇంటర్నేషనల్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు సోమవారం గుడ్‌‌‌‌బై చెప్పాడు. అయితే వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా జరిగే ఫ్రాంచైజీ క్రికెట్‌‌‌‌కు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. పాకిస్తాన్‌‌‌‌ సూపర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌)లో 41 ఏళ్ల హఫీజ్‌‌‌‌.. లాహోర్‌‌‌‌ క్విలాండర్స్‌‌‌‌ తరఫున ఆడుతున్నాడు. 2018లో టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పిన హఫీజ్‌‌‌‌.. అన్ని ఫార్మాట్లలో పాక్‌‌‌‌ టీమ్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు. పాక్‌‌‌‌ తరఫున 392 ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడిన తను 12,789 రన్స్‌‌‌‌ చేసి. 253 వికెట్లు తీశాడు. 55 టెస్ట్‌‌‌‌లు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. 3 ఐసీసీ వన్డే,  6  టీ20 వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌లో పోటీపడ్డాడు.