షాహీన్ అఫ్రిదీకి షమీ చిట్కాలు

షాహీన్ అఫ్రిదీకి షమీ చిట్కాలు

టీ20 వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడబోతుంది. అక్టోబర్ 23న మెల్ బోర్న్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయర్లు ఇప్పటి నుంచే చమటోడుస్తున్నారు. భారత్ పాక్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు.  ఇందులో భాగంగా టీమిండియా బౌలర్ షమీ, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ ప్రాక్టీస్ సెషన్లో ముచ్చటించుకున్నారు. అఫ్రిదీకి షమీ చిట్కాలను అందించాడు. 

నేను మీకు ఫ్యాన్ 
షమీతో కాసేపు ముచ్చటించిన షాహీన్ అఫ్రిదీ..తాను మీకు ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. తాను బౌలింగ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అనుసరిస్తున్నానని తెలిపాడు. షమీ మణికట్టుకు పెద్ద అభిమానిని వెల్లడించాడు. స్ట్రేయిట్ సీమ్" అని షాహీన్ షా ప్రశంసించాడు. రిలీజ్ పాయింట్..పాయింట్లో ఉంటే..సీమ్ ఆటోమేటిక్‌గా బాగుంటుందని  షమీ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

పాక కెప్టెన్కు గిఫ్ట్..
టీమిండియా మాజీ క్రికెటర్ పాక్ కెప్టెన్తో సరదాగా గడిపాడు. ఓ ప్రైవేట్ పార్టీలో గవాస్కర్ను కలిసిన బాబర్ ఆజమ్...ఆయనతో కాసేపు ముచ్చటించాడు.  ఈ సందర్భంగా ఆజమ్కు గవాస్కర్ ఆటోగ్రాఫ్ ఉన్న టోపీని గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ వీడియో వైరల్గా మారింది.