పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చిన్న టార్గెట్‌ను ఈజీగా ఛేదించిన పాకిస్తాన్.. వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇరుజట్లు 1–1తో పంచుకున్నాయి. విండీస్ నిర్దేశించిన 75 రన్స్ లక్ష్యాన్ని పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 23.3 ఓవర్లలో 77/2 స్కోరు చేసి ఛేదించింది.
అజాన్ అవైస్ (18), ఇమామ్ (9) ఫెయిలైనా.. అబ్దుల్లా షఫీక్ (24 నాటౌట్), బాబర్ ఆజమ్ (24 నాటౌట్) నిలకడగా ఆడి గెలిపించారు. అంతకుముందు 103/6 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 46.1 ఓవర్లలో 117 రన్స్‌కే ఆలౌటైంది. కావెమ్ హెడ్జ్ (34) మినహా మిగతా వారు నిరాశపర్చారు. దాంతో పాక్ ముందు 75 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అబ్దుల్లా షఫీక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
