ఐపీఎల్ 2027 ఆడనున్న పాక్ స్టార్ పేసర్?.. మహ్మద్ ఆమిర్ ఎంట్రీలో బిగ్ ట్విస్ట్! 

ఐపీఎల్ 2027 ఆడనున్న పాక్ స్టార్ పేసర్?.. మహ్మద్ ఆమిర్ ఎంట్రీలో బిగ్ ట్విస్ట్! 

Mohammad Amir In IPL: ముంబై ఉగ్రదాడుల (2008) తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు పూర్తిగా క్యాన్సిల్ అయ్యాయి. ఐసీసీ (ICC), ఆసియాకప్ లాంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. అలాగే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడేందుకు కూడా పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ (Mohammad Amir) ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇటీవలే మహ్మద్ ఆమిర్ బ్రిటీష్ పౌరసత్వాన్ని (British Citizenship) పొందడంతో అధికారికంగా బ్రిటన్ జాతీయతను కలిగి ఉన్నాడు. దీంతో ఆమిర్ పాకిస్తాన్ లో పుట్టినప్పటికీ, బ్రిటీష్ పౌరసత్వం, యూకే (UK) పాస్‌పోర్ట్ రావడంతో ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్ హోదా కింద పేరు నమోదు చేసుకునేందుకు సాంకేతికంగా అర్హత లభించింది. 

ఐపీఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి?: 
2008 ముంబై దాడుల తర్వాత బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పాస్ పోర్టులు కలిగిన క్రికెటర్లను ఐపీఎల్లో ఆడేందుకు పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. అంతర్జాతీయ ప్లేయర్స్ వేలంలో పాల్గొనాలనుకుంటే తమ పాస్‌పోర్ట్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. భౌగోళిక ఆంక్షలతో కేవలం పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉన్న ప్లేయర్స్ ని తీసుకోకూడదనే నిబంధన ఉంది. ప్రస్తుతం ఆమిర్ దగ్గర యూకే పాస్‌పోర్ట్ ఉండటంతో.. బ్రిటీష్ పౌరుడిగా వేలంలో పేరు నమోదు చేసుకునేందుకు అతనికి ఛాన్స్ ఉంది. 
 
ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీపై అనుమానాలు?: 
సాంకేతికంగా మహ్మద్ ఆమిర్ డ్రాఫ్ట్ చేయడానికి అర్హుడైనప్పటికీ, ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్లో అతడు ఆడుతాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. 

►ALSO READ | ముంబైతో కీలక పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌కతా

* ఫ్రాంచైజీల ఆసక్తి: వేలంలో ఫ్రాంచైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాయా అన్నది అనుమానమే. ఇటీవలే 'ది హండ్రెడ్', 'SA20' టోర్నీల్లో పాక్ లో జన్మించిన ఆటగాళ్లను చేర్చడంపై పెద్దఎత్తున వివాదాలు చెలరేగాయి.

* బీసీసీఐ సున్నితత్వ అంశం: ఐపీఎల్లో ఆడేందుకు అధికారికంగా ఆమిరు అర్హత సాధించినప్పటికీ.. బీసీసీఐ (BCCI) మాత్రం భౌగోళిక-రాజకీయ సున్నితత్వ అంశానికే ప్రాధాన్యత ఇస్తే మాత్రం అతడు వేలంలో పేరు నమోదు చేసుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. 

* పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్: ముఖ్యంగా గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ ఘటన తర్వాత ఐపీఎల్లో పాల్గొనే ప్లేయర్స్ పై కఠిన ఆంక్షలని విధించారు. గతేడాది టీ20 ప్రపంచకప్ కు ముందు బంగ్లాదేశ్ భారత్ లో ఆడేందుకు నిరాకరించడంతో ముస్తఫిజర్ ని కేకేఆర్ జట్టు నుంచి తప్పించారు. ఈ లెక్కన మహ్మద్ ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీ జరగడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్ కి పూర్తిగా వీడ్కోలు పలకడంతో అతడికి ప్లస్ అయింది.