ముంబైతో కీలక పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌కతా

ముంబైతో కీలక పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్‌కతా

ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌ జరగబోతుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే.. మొదటగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో తొలుత ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

మాస్ ప్లాన్‌తో రహానే: 
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఇక్కడి లెక్కలన్నీ చాలా సింపుల్.. మేము ప్రస్తుత క్షణంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మాకు మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి.. టోర్నమెంట్ ఫస్టాఫ్‌లో మేము కొన్ని కీలక మ్యాచులని చేజార్చుకున్నాం, లేదంటే మా పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది.. ఈ పిచ్‌ను అంచనా వేయడం కాస్త కష్టంగా ఉంది.. అందుకే 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెడుతాం.. మేము ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ ఆడిన సేమ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామని రహానే స్పష్టం చేశాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా మొదట బౌలింగే ఎంచుకునేవాళ్లం.. ఎందుకంటే ఈ పిచ్‌ను చాలా సేపు కవర్లతో కప్పి ఉంచారు.. పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని అనుకున్నాం.. మేము మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ క్రికెట్ ఆడుతూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం.. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి.. నేను (హార్దిక్) మళ్లీ జట్టులోకి వచ్చాను, అలాగే స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ (Ghaza) కూడా తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడని వెల్లడించాడు. 

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్( వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్య రహానె(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే