పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది?

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది?

పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది.  కేంద్రం విధించిన గడువు 2023 జూలై 30తో ముగియనుంది.  భారత ప్రభుత్వం 2017లో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు వాస్తవానికి మార్చి 31, 2022, కానీ అది మార్చి 31, 2023 వరకు, ఆ తర్వాత జూన్ 30, 2023 వరకు పొడిగించబడింది.. కానీ ఇప్పుడు పొడిగించే అవకాశం కనిపించడం లేదు.   ఇప్పటకీ లక్షల మంది అనుసంధానం చేసుకోలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది? లింక్ చేయకపోతే జరిగే నష్టం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది? 

1. ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు
2. పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ ఆగిపోతుంది
3. మీరు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి రావాల్సిన రిఫండ్స్ నిలిచిపోతాయి.
4. ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో పెండింగ్ లో ఉన్న అని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. మీరు ముందుకు వెళ్లలేరు. మీ దరఖాస్తుల పరిశీలిన సైతం నిలిచిపోతుంది.
5. పాన్ కార్డు పని చేయదు కనుక.. పన్ను మినహాయింపులు ఎక్కువగా ఉంటాయి. మీకు సహజంగా వచ్చే పన్ను రాయితీలను కోల్పోతారు. దీని వల్ల పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
6.పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు తాత్కాలికంగా నిలిచిపోతుంది.


పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?

1. ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లండి.-- https://www.income tax.gov.in/iec/foportal/ లింక్​పై క్లిక్ చేయండి
2. హోమ్‌‌‌‌‌‌‌‌పేజీలో, క్విక్ లింక్‌‌‌‌‌‌‌‌లను ఎంచుకుని, ఆపై ఆధార్ స్టేటస్​ను చెక్ చేయండి
3. ఇప్పుడు  పాన్,  ఆధార్ నంబర్‌‌‌‌‌‌‌‌లను నమోదు చేయాల్సిన రెండు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లు కనిపిస్తాయి
4. దీని తరువాత, ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. ఆధార్  పాన్ లింక్ అయి ఉంటే ‘‘మీ పాన్​కార్డుతో ఆధార్‌‌‌‌‌‌‌‌ లింకింగ్ పూర్తయింది” అని మెసేజ్ కనిపిస్తుంది
5. మీ పాన్  ఆధార్ లింక్ చేయకుంటే,  స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై మెసేజ్ వస్తుంది. - పాన్ ఆధార్‌‌‌‌‌‌‌‌తో లింక్ కాలేదని, ఈ పనిని పూర్తి చేయడానికి దయచేసి '‘లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి”అనే రిక్వెస్ట్ 
కనిపిస్తుంది
6. అన్ని వివరాలు ఇచ్చాక ‘‘మీ ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐకి వెళ్లింది. హోమ్ పేజీలోని 'లింక్ ఆధార్ స్టేటస్' లింక్‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేసి స్టేటస్ను తెలుసుకోండి”అంటూ మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా స్టేటస్​ను చెక్ చేయడానికి 567678 లేదా 56161కు మెసేజ్ పంపాలి. లింకింగ్ పూర్తయితే ... అయిందనీ.. లేకుంటే కాలేదనీ రిప్లై వస్తుంది.