హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపుపై పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల జీతాలను నేరుగా గ్రామ పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ కమిషనర్ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీపర్పస్ వర్కర్లకు గతంలో రూ.8,500 ఉన్న వేతనాన్ని ప్రభుత్వం రూ.9,500కు పెంచిన విషయం తెలిసిందే.
నవంబర్-2025 వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్ సీ) గ్రాంట్ల ద్వారా కార్మికుల వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయనుంది.
