
హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్బంగా నియోజకవర్గంలో ఎలక్షన్ ఫ్లయింగ్, స్టాటిక్ టీమ్స్ చెకింగ్ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
అక్టోబర్ 8న పంజాగుట్ట పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనగర్ కాలనీలో ఓ కారులో 4 లక్షల రూపాయల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ అతిక్రమించి మద్యం బాటిల్స్, నగదు సరఫరా చేస్తున్న వారి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు.
మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొలిటికల్ పోస్టర్ లు, బ్యానర్ లు తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటివరకు అనుమతులు లేని 1,620 పొలిటికల్ పోస్టర్ లు, బ్యానర్ లు తొలగించారు.
జూబ్లీహిల్స్ బైపోల్ అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరించనున్నారు. నవంబర్ 11న జరగనుండగా..14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 2025జూన్ 8న మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. కాంగ్రెస్,బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.