ఆధార్ బిల్లుకు ఆమోదం

ఆధార్ బిల్లుకు ఆమోదం

బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, మొబైల్ కనెక్షన్లకు, కేవైసీ అథెంటికేషన్​కు ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్​గా ఉపయోగించేందుకు సంబంధించిన ఆధార్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం ఈ మేరకు రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా బిల్లు పాస్ అయింది. డేటా చోరీ జరిగే అవకాశం ఉందన్న కారణంతో తృణముల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఆధార్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు సంస్థలకు రూ.కోటి వరకు పెనాల్టీ, జైలు శిక్షలు విధించేలా కొత్త చట్టంలో రూల్స్ పొందుపరిచారు.

ఏపీలో రెండు వర్సిటీలకు లోక్​సభలో బిల్లు

ఆంధ్రప్రదేశ్​లో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధించి సోమవారం లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టారు. విభజన చట్టంప్రకారం ఏపీలో సెంట్రల్, గిరిజన వర్సిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

‘జలియన్ వాలా బాగ్’ బిల్లు కూడా..

జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులో పర్మినెంట్ మెంబర్​గా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండాలన్న నిబంధనను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్​సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ సవరణ బిల్​ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి.. సభలో పెట్టారు. అయితే దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.