డిజిటలైజేషన్ లో పార్లమెంటు సమావేశాలు

డిజిటలైజేషన్ లో పార్లమెంటు సమావేశాలు

కరోనా వైరస్ కారణంగా ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలను సాధ్యమైనంత ఎక్కువ డిజిటల్‌ విధానంలోనే నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని లోకసేభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ఇప్పటికే సభ కార్యకలాపాల నిర్వహణను 62 శాతం వరకు డిజిటల్‌ విధానంలోకి మార్చామన్నారు. సభకు హాజరయ్యే ప్రతి సభ్యుడు మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. సభ్యులంతా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌లోనే హాజరు నవెూదు చేయాలని… ప్రశ్నలను కూడా డిజిటల్‌ రూపంలోనే పంపాలని కోరారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ సీట్లు ఏర్పాటు చేశామన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో 257 మంది లోకసేభ హాల్లో, 172 మంది లోకసభ గ్యాలరీలో, 60 మంది రాజ్యసభలో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలో కూర్చోనున్నారు. వంతులవారీగా లోకసభ, రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి.