హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు అధికార ప్రతినిధులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. అధికార ప్రతినిధులుగా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, హైకోర్టు అడ్వొకేట్ ఎర్రం రచనా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఇన్చార్జి కట్టా సుధాకర్‌ను నియమించారు.

