
ఇంతకీ రజిని కాంత్ అల్లుడు హీరో ధనుష్ ఎవరి కొడుకు..?కస్తూరి రాజా కొడుకా లేదంటే కదిరేశన్ కొడుకా అనే ఇలాంటి అనేమానాలెన్నో ఆయన అభిమానులు మెదడులను తొలిచేస్తున్నాయి.
వెండితెరపై తనకంటూ ట్రెండ్ ను సెట్ చేసుకున్న ధనుష్..తన నిజజీవితంలో అనేక సస్పెన్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం మధురైకి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ధనుష్ తమకొడుకేనని, చిన్నప్పుడు తిట్టారని ఇంట్లో నుంచి పారిపోయాడంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధురై కోర్ట్ ధనుష్ కు షాకిచ్చింది. తాజాగా ధనుష్ బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ పై విచారణ చేపట్టిన కోర్ట్ .. ఇంత జరుగుతున్నా ధనుష్ సంబంధిత సర్టిఫికెట్లను కోర్ట్ లో ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నించింది. తక్షణమే అన్ని ఒరిజినల్ సర్టిపికెట్లను కోర్ట్ కు అప్పగించాలని చెన్నై కార్పోరేషన్ కు ఆదేశించింది.
మరోవైపు ధనుష్ తమకొడుకేనని నిరూపించుకోవడాన్ని కదిరేసన్ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నకొడుకు తామెవరో తెలియదని చెప్పడం పై కోర్ట్ లో కన్నీటి పర్యంతరమవుతున్నారు.