హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు పేషంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( ఫిబ్రవరి 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం దగ్గర ఇద్దరు పేషంట్లతో వెళ్తున్న అంబులెన్స్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక పేషంట్ గాయాలతో బయటపడగా.. మరో పేషెంట్ అంబులెన్స్ లోనే ఇరుక్కుపోయాడు.
అంబులెన్స్ లో ఇరుక్కుపోయిన పేషెంట్ ను అతికష్టం మీ బయటికి తీశారు స్థానికులు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అసలే పేషెంట్ట్రీ.. ట్మెంట్ కోసం ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యాయి గాయపడటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు.
ఆగి ఉన్న లారీ ఢీకొట్టడం అంబులెన్స్ డ్రైవర్ డే తప్పిదమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బంధువులు.
