హైదరాబాద్, వెలుగు: తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేంద ర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. మహేందర్ రెడ్డి ఔట్ డేటెడ్ వ్యక్తి అని రోహిత్‌రెడ్డి కామెంట్ చేయగా.. తాను ఔట్‌డేటెడ్ కాదని, పార్టీ మారినప్పుడే రోహిత్‌రెడ్డి ఔట్ డేటెడ్అయ్యారని మహేందర్‌రెడ్డి శనివారం కౌంటర్ ఇచ్చారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వల్లే రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచాడని విమర్శించారు. అనుకోకుండా ఎమ్మెల్యేగా గెలిచి పెద్ద మొనగాడిలా ఫీల్ అవుతున్నాడని మండిపడ్డారు. రోహిత్ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
పట్నం మహేందర్‌రెడ్డి ఔట్‌డేటెడ్ లీడర్: పైలెట్ రోహిత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పట్నం మహేందర్‌రెడ్డి ఔట్ డేటెడ్ లీడర్ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తాను నరేంద్ర మోదీలా వీడియో షూట్ చేయలేదని.. క్యాజువల్‌గా నడుచుకుంటూ వస్తుంటే తన ఫ్రెండ్స్ స్నాప్‌చాట్‌లో వీడియో తీశారని.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్అయ్యిందని తెలి పారు. ప్రభుత్వ సిబ్బందిని వీడియోల కోసం వాడుకునే వ్యక్తిని కాదన్నారు. హోమం పూర్తయ్యాక ఒక స్పార్క్వచ్చి మంటలు అంటుకున్నాయని.. హోమం పూర్తయ్యాక అలా మంటలు రావడం శుభపరిణామమని పండితులు చెప్పారన్నారు.
