రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ( జూన్ 16) పట్టణ ప్రగతి వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం, సరూర్ నగర్ డివిజన్ లో వార్డు కార్యాలయాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త లతో కలిసి ప్రారంభించారు.ఉత్సవాల్లో భాగంగా సఫాయి కార్మికులను సన్మానించారు. 142 వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి సబితా తెలిపారు. వార్డు కార్యాలయాల సిబ్బంది ప్రజలకు జవాబు దారిగా ఉంటూ.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలనన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు 22 వేల కంపెనీలు వచ్చాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి . తెలంగాణ ఏర్పడిన తరువాత పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను,మండలాలను, గ్రామపంచాయతీ మున్సిపాలిటీలను,కార్పొరేషన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.
