ఇప్పటివరకు అభ్యర్థులు రెండు టెస్టులు పాసైతేనే పర్మినెంట్ లైసెన్స్జారీ చేస్తున్నారు. ఇందులో ఎల్ఎల్ఆర్ (లెర్నర్ లైసెన్స్రిజిస్ట్రేషన్) టెస్ట్, తర్వాత డ్రైవింగ్స్కిల్ టెస్ట్మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులు పాసయితే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. కానీ, ఇక నుంచి ఈ రెండు టెస్టుల కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
చాలా మందికి లైసెన్స్ఉన్నా డ్రైవింగ్‌లో సరైన నైపుణ్యం ఉండడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి అధికారులు ట్రాఫిక్ నిబంధనలు తెలిసేలా లైసెన్సుల జారీకి ముందే రోడ్‌సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ పాసైతే సర్టిఫైడ్ నంబర్ ఇస్తారు. ఈ నంబర్ ద్వారా లర్నింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
►ALSO READ | శృంగేరి పీఠం ఆధ్వర్యంలో బాసర మాస్టర్ ప్లాన్ ..రాతి శిలలతో నిర్మాణం దీని ప్రత్యేకత
రోజూ ఒక్కో ఆర్టీఏ ఆఫీసులకు వందల సంఖ్యలో కొత్త లైసెన్సులు, పర్మినెంట్ లైసెన్సుల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. కొత్తగా లైసెన్స్ పొందే వారికి స్లాట్ బుక్ చేసుకున్న రోజే ఆర్టీఏ ఆఫీసులో ట్రాఫిక్ రూల్స్‌పై కంప్యూటర్లో పరీక్ష పెడతారు. అందులో పాస్అయితే వెంటనే లర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. దీని వ్యాలిడిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈలోపు పర్మినెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్బుక్చేసుకున్న రోజు దరఖాస్తుదారు టూవీలర్ లేదా కారును టెస్ట్ట్రాక్పై నడపాల్సి ఉంటుంది.ఓకే అయితే, పర్మినెంట్లైసెన్స్జారీ చేస్తారు.
రోడ్ సేఫ్టీ రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ కొత్త రూల్ అమలు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నివేదిక రాగానే అమలు చేయనున్నారు.
