ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, హీరోయిన్ త్రిష పెట్టిన పోస్టూలు ఆసక్తిగా మారాయి. కొలీవుడ్‌లో ప్రస్తుతం త్రిష–విజయ్ మధ్య సంబంధంపై వస్తున్న రూమర్స్ భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష చేసిన లేటెస్ట్ మీడియా పోస్టులు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
త్రిష పోస్టులు వైరల్
ఈ పరిణామాల మధ్య త్రిష షేర్ చేసిన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఆమె షేర్ చేసిన వీడియోలో “జీవితంలో ఒక దశకు చేరుకున్నాను.. వాదనలు చేయడం మానేశాను. నిజం కంటే మనశ్శాంతి ముఖ్యం” అంటూ వీడియో షేర్ చేసింది.
అలాగే మరో పోస్టులో “ప్రేమే అన్నీ కాదు, కానీ ప్రేమ లేకపోతే అన్నీ అర్థంలేనివే” అనే కోట్ పంచుకుంది. దీనికి త్రిష “ఇది Fact” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో రూమర్స్‌తో లింక్ చేస్తూ చర్చిస్తున్నారు. అయితే, విజయ్ తో త్రిషకు ఉన్న రూమర్స్ అన్నీ క్లారిటీ లేనివిగా మిగిలాయి.
ఎందుకంటే, ఇటీవల కాలంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, త్రిష గానీ, విజయ్ గానీ ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఈ అంశంపై స్పష్టత రానివ్వకుండా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
చెన్నై ఈవెంట్ తర్వాత పెరిగిన చర్చ
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్‌తో కలిసి హాజరైన త్రిషపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వెలువడటంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. సంగీత తన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం.
►ALSO READ | Zayn Marie Khan: బోల్డ్ లుక్‌తో సెన్సేషన్.. ఒక్క ఈవెంట్ తోనే ఇంటర్నెట్ షేక్..
ఒక నటితో సంబంధం పెట్టుకోవడంతో పాటు , మానసిక వేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు బహిర్గతమైతే తన ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
ఎన్నికల వ్యూహంలో విజయ్ బిజీ..
మరోవైపు, విజయ్ తన సినిమా కెరీర్‌కు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన 'టీవీకే' పార్టీని బలోపేతం చేస్తున్నారు. మొత్తం 234 స్థానాలకు టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. ఈ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నాడు.
టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువకుల్లో విజయ్ టీవీకే పార్టీకి మంచి క్రేజ్ ఉంది.18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లలో మెజారిటీ ఓట్లు విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై, మదురై, తిరుప్పూర్ వంటి నగరాల్లో టీవీకే బలంగా పుంజుకుంటోంది.
(1/3) pic.twitter.com/nrz8VdtsQ4
— TVK Vijay (@TVKVijayHQ) March 29, 2026
