Zayn Marie Khan: బోల్డ్ లుక్‌తో సెన్సేషన్.. ఒక్క ఈవెంట్ తోనే ఇంట‌ర్నెట్‌ షేక్.. ఎవరీ వైరల్ బ్యూటీ?

Zayn Marie Khan: బోల్డ్ లుక్‌తో సెన్సేషన్.. ఒక్క ఈవెంట్ తోనే ఇంట‌ర్నెట్‌ షేక్.. ఎవరీ వైరల్ బ్యూటీ?

జైన్ మేరీ ఖాన్ (Zayn Marie Khan).. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌ను తన అందంతో తక్రిందులు చేస్తోంది. తనదైన నేచురల్ గ్లామర్, స్టైలిష్ లుక్స్‌తో ఈ బ్యూటీ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ బ్యూటీ ఫొటోస్ చూసిన నెటిజన్లు సైతం ఎక్కడిక్కడ కుదేలు అవుతున్నారు.

ఇటీవల ‘డెకాయిట్’ ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న జైన్ మేరీ ఖాన్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆమె వేసుకున్న బోల్డ్ డ్రెస్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నెటిజన్లు ఈ లుక్‌పై విభిన్నంగా స్పందిస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో “జైన్ మేరీ ఖాన్ ఎవరు?” ఎక్కడి నుంచి వచ్చింది? అనే ఆసక్తి మరింత పెరిగింది.

అడివి శేష్ హీరోగా షానియల్ డియో తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌‌‌‌‌‌‌‌’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కుర్ర బ్యూటీ జైన్ మేరీ ఖాన్ కూడా నటిస్తోంది.

ఈ సినిమాలో ‘జానకి’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లలో ఆమె హాజరైంది. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఆమె స్టైల్, ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకర్షించడంతో, మొత్తం ఫోకస్ ఆమెపైనే పడింది.

జైన్ మేరీ ఖాన్ బ్యాక్ గ్రౌండ్:

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కజిన్‌‌‌‌‌‌‌‌ బ్రదర్‌‌‌‌‌‌‌‌, దర్శకుడు‌‌‌‌‌‌‌‌ మన్సూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూతురే జైన్ మేరీ ఖాన్. అంటే,ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ కు జైన్ మేరీ ఖాన్ మేనకోడలు అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో హిందీ నటులు ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్ ఆమెకు కజిన్స్ అవుతారు. ప్రస్తుతం జైన్ వయస్సు సుమారు 31 సంవత్సరాలు.

సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు, ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి సినిమాలకు ఆమె పనిచేసి అనుభవం సంపాదించింది. అనంతరం 'ఇల్లీగల్' అనే వెబ్ సిరీస్ లో నటించి నటించి మంచి గుర్తింపు పొందింది.

ఇప్పుడు ‘డెకాయిట్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని  అన్నపూర్ణ  స్టూడియోస్  సమర్పణలో  సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zayn Khan (@zaynmarie)