
మార్షల్ ఆర్ట్స్ ను ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్.. తన సినిమాల్లో ఏదో ఒక సీన్‌లో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం కథ ప్రకారం మార్షల్ ఆర్ట్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. దాంతో ఆమధ్య ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండడంతో ఆ ప్రాక్టీస్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ స్టిల్‌ను శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్.
‘ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో మొఘలుల కాలం నాటి బందిపోటుగా ఆయన నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.