సెట్స్ నుంచి లీకైన పవన్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్

సెట్స్ నుంచి లీకైన పవన్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan kalyan) స్పీడ్ పెంచాడు. రాజకీయాల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైన ఈ మెగా హీరో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ లోటును పూర్తిగా తీర్చేస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపుతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తో ‘హరిహర వీరమల్లు’, సుజీత్ తో ‘ఓజీ’ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు.

 గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కూడా రిపీట్ కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరీశ్ శంకర్ తో తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad bhagath singh) ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా(Tollywood)కు సంబంధించిన సెట్ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి లీకైనట్టుగా తెలుస్తోంది. 

టీషర్ట్, లుంగీ, బియర్డ్ లుక్ లో పవన్ మాసీగా కనిపిస్తున్నాడు. అయితే, ఇటీవల వచ్చిన భీమ్లానాయక్ లుక్ కు ఇది కాస్త దగ్గరగా ఉందంటూ కొందరు అంటున్నారు. తాజాగా లీకైన పవన్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

https://twitter.com/AmarnadhDasam/status/1644765639524118528