పేటీఎం షేరు పడుతూనే ఉంది

పేటీఎం షేరు పడుతూనే ఉంది

ముంబై: పేటీఎం షేర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్టాక్​ ధర మంగళవారం లైఫ్​టైం లోకి చేరి రూ.550.50 వద్ద ముగిసింది. తాజా మరో మూడుశాతం నష్టపోయింది. ఇన్వెస్టర్లకు పేటీఎం షేరుపై నమ్మకం తగ్గిపోవడంతో బేరిష్​ ట్రెండ్​ కనిపిస్తోంది. పేటీఎం ఇష్యూ ధర రూ.2,150 కాగా, ఇప్పటి వరకు 75 శాతం పడిపోయింది. పేటీఎం గురించి నెగటివ్​ వార్తలు రావడంతో గత నెల నుంచే 32 శాతం నష్టపోయింది. ఈ స్టాక్​ గత నవంబరు 18న ఇంట్రాడే ట్రేడ్​లో రికార్డ్ హై రూ.1,961.02లకు చేరింది. ఇప్పటికి వరకు ఏనాడూ లిస్టింగ్​ ధరను అందుకోలేకపోయింది.

గత నాలుగు నెలల్లో పేటీఎం మార్కెట్​క్యాప్​ రూ.1.03 లక్షల కోట్లు నష్టపోయి రూ.35,500 కోట్లకు చేరుకుంది. చాలా బ్రోకరేజీలు పేటీఎం షేరు ప్రైస్​ టార్గెట్​ను తగ్గించాయి. ధర మరింత పడొచ్చని చెబుతున్నాయి.  కొన్ని రీసెర్స్​ సంస్థలు ఈ షేర్‌ వ్యాల్యూను తగ్గించి... టార్గెట్‌ ఇచ్చాయి. ఆ టార్గెట్లను కూడా దాటి మరీ తగ్గడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పేటీఎం షేర్ల పతనంపై బీఎస్​ఈ కూడా స్పందించింది. స్టాకులు ఇంతగా ఎందుకు తగ్గుతున్నాయో వివరణ ఇవ్వాలని పేటీఎంను ఆదేశించింది.