ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్లతో పాటు ఎలక్ట్రిక్  స్కూటర్లు, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్లను లాంచ్ చేస్తామని కంపెనీ  పేర్కొంది. బ్రాంచ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించనుంది. ఈ సబ్సిడరీకి హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జియోవన్ని నోటర్బార్టోలో డి ఫర్నరీ పనిచేస్తారు.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విస్తరణలో  భాగంగా ఇటలీలో కార్యకలాపాలు మొదలు పెట్టామని టీవీఎస్ మోటార్  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న టీవీఎస్ అపాచి 310 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇటలీలో లాంచ్ చేయనుంది. వీటిని బీఎండబ్ల్యూ భాగస్వామ్యంతో డెవలప్ చేసింది. టీవీఎస్ రోనిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 250 , రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , జూపిటర్ 125, ఐక్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇటలీలో లాంచ్ చేయనుంది.