పైసా వసూల్.. ఇండియాలో బెస్ట్ మైలేజీ ఇచ్చే టాప్ 10 బైక్స్ ఇవే..

 పైసా వసూల్.. ఇండియాలో బెస్ట్ మైలేజీ ఇచ్చే టాప్ 10 బైక్స్ ఇవే..

 సాధారణంగా బైక్ కొనేటప్పుడు అందరూ అడిగే మొదటి ప్రశ్న.. మైలేజీ ఎంత ఇస్తుంది? అని.... పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు మైలేజీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వేలకు వేలు పోసి కొన్న బైక్ మైలేజ్ ఇవ్వకపోతే ఆర్ధికంగా మీ జేబుకి  చిల్లు పడుతుంది. ఈ బైక్స్ అన్ని కూడా చాలా అందంగా, సౌకర్యంగా, మీకు కంఫర్ట్ రైడ్‌ను ఇస్తాయి.  అలాగే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మీరు గొప్ప మైలేజ్, మంచి పర్ఫార్మెన్స్  బైక్ కోసం చూస్తున్నట్లయితే ఇవి మీకు సరైన అప్షన్ కావొచ్చు.... 

బెస్ట్ మైలేజీ ఇచ్చే టాప్ 10 బైక్స్  (2026) ఇదిగో: 

టీవీఎస్ రేడియన్: ఈ బైక్ ధర  రూ.69వేల983. దీనికి 109.7 సిసి ఇంజన్, 8.08 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 62.5 కి.మీ ఇస్తుంది. 

హోండా SP 125: ఈ బైక్ ధర  రూ.88వేల749. దీనికి 123.94 సిసి ఇంజన్, 10.72 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 63 కి.మీ.లీ ప్రయాణిస్తుంది. 

హోండా షైన్ 100: ఈ  బైక్ ధర  రూ.65వేల556. దీనికి 98.98 సిసి ఇంజన్,  7.28 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 65 కి.మీ.లీ. 

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్: ఈ  బైక్ ధర  రూ. 77వేల103 . దీనికి  97.2 సిసి ఇంజన్,  7.9 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు  65 కి.మీ.లీ.

హీరో HF డీలక్స్: ఈ బైక్ ధర  రూ.57వేల984. ఈ బైకుకి 97.2 సిసి ఇంజన్,  7.91 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 65 కి.మీ.లీ ఇస్తుంది. 

బజాజ్ ప్లాటినా 110: ఈ బైక్ ధర  రూ.69వేల563  కాగా... ఇదొక 115.45 సిసి ఇంజన్ బైక్,  8.48 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 70 కి.మీ.లీ వెళ్లగలదు. 

బజాజ్ CT 110: ఈ బైక్ ధర  రూ.67వేల417. దీనికి 115.45 సిసి ఇంజన్ ఇవ్వగా,  8.48 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 70 కి.మీ.లీ వెళ్తుంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్: ఈ బైక్ ధర  రూ. 72వేల025 . దీనికి 109.7 సిసి ఇంజన్, 8.08 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 70 కి.మీ.లీ ఇస్తుంది. 

టీవీఎస్ స్పోర్ట్: ఈ బైక్ ధర  రూ.61వేల625. దీనికి 109.7 సిసి ఇంజన్ ఇచ్చారు,  8.08 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 70 కి.మీ.లీ ఇస్తుంది.

బజాజ్ ప్లాటినా 100: ఈ బైక్ ధర రూ.66వేల060.  దీనికి 102 సిసి ఇంజన్,  7.79 బిహెచ్‌పి, మైలేజ్ లీటరుకు 75 కి.మీ.లీ ఇస్తుంది.  

అయితే ఈ బైక్ ధరలు అన్ని కూడా ఎక్స్ షోరూం ధరలు. అలాగే ధరలు రాష్ట్రం, ప్రదేశం బట్టి కూడా మారుతుంటాయి.