కార్లలో ఉన్నట్లు.. EV బైక్స్ లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ వస్తుందా..

కార్లలో ఉన్నట్లు..  EV బైక్స్ లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ వస్తుందా..

ఏథర్ ఎనర్జీ (Ather Energy) కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం  కొత్తగా  ఇన్ఫినిట్ క్రూయిజ్ (Infinite Cruise) అనే ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ ఫీచర్ కేవలం  '450 అపెక్స్' మోడల్‌లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అన్ని 450X స్కూటర్లలో తీసుకొస్తుంది.

 1 జనవరి 2025 తర్వాత 450X కొన్నవారికి అలాగే  కొత్తగా కొనేవారికి ఈ ఫీచర్ ఫ్రీగా లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (OTA) ద్వారా కంపెనీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనివల్ల సుమారు 44వేల మంది పాత కస్టమర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది. 

ALSO READ : ఈ తరం కుర్రోళ్ల అప్పుల వెనక షాకింగ్ నిజాలు..

ఇన్ఫినిట్ క్రూయిజ్ అంటే సాధారణంగా కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ హైవేలపై ఒకే స్పీడ్ తో వెళ్లడానికి వాడతారు. కానీ ఏథర్ తెచ్చిన ఈ కొత్త టెక్నాలజీ మన సిటీ నగరాల్లోని ట్రాఫిక్‌కు తగ్గట్టుగా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే ?
 మీరు 10 కి.మీ స్పీడ్ దాటినప్పటి నుండి దీనిని వాడవచ్చు. అంటే 10 నుండి 90 కి.మీ స్పీడ్  వరకు ఈ ఫీచర్  పనిచేస్తుంది. సాధారణ క్రూయిజ్ కంట్రోల్‌లో బ్రేక్ వేస్తే సిస్టమ్ ఆగిపోతుంది. కానీ ఇందులో బ్రేక్ వేసినప్పుడు తాత్కాలికంగా ఆగి, మీరు మళ్ళీ యాక్సిలరేటర్ ఇవ్వగానే కొత్త స్పీడ్ కి తగ్గట్టుగా సెట్ అయిపోతుంది.

ALSO READ : చనిపోయిన కొడుకు ఆశయం కోసం..

ఈ క్రూయిజ్ కంట్రోల్లో మూడు రకాల ఫంక్షన్లు ఉంటాయి. ఒకటి సిటీక్రూజ్ దీని ద్వారా ట్రాఫిక్‌లో స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. రెండోది హిల్ కంట్రోల్ దీని ద్వారా  కొండ ప్రాంతాలు లేదా ఎత్తువంపులు ఉన్న రోడ్లపై స్కూటర్ ఒకే వేగంతో వెళ్లేలా చూస్తుంది. మూడోది క్రాళ్ కంట్రోల్,  గుంతలున్న రోడ్లపై తక్కువ వేగంతో బ్యాలెన్స్‌డ్‌గా వెళ్లడానికి సాయపడుతుంది.

ALSO READ : టీసీఎస్ టెక్కీలకు షాకింగ్ వార్త.. 

 ప్రస్తుతం ఏథర్ 450X స్కూటర్ ధర బెంగళూరులో సుమారు రూ. 1.48 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. ఇన్ఫినిట్ క్రూయిజ్‌ను మొదట ఏథర్ కమ్యూనిటీ డే 2025లో ప్రకటించారు. గత ఏడాది ఆగస్టులో అపెక్స్ 450లో మొదట  ప్రవేశపెట్టారు. హైవేల కోసం  రూపొందించిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ల కాకుండా, ఈ ఇన్ఫినిట్ క్రూయిజ్‌ స్కూటర్లు తక్కువ స్పీడ్ తో పనిచేస్తాయి. అంటే ట్రాఫిక్ లో  ప్రతిసారి స్టాప్-స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సిటీ  రైడింగ్  కోసం ఈ వ్యవస్థను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఏథర్ చెప్పింది.