ఆరోగ్యంగా ఉన్నా జాగ్రత్త..ఎయిర్ పొల్యూషన్‌తో గుండెపోటు ముప్పు!

ఆరోగ్యంగా ఉన్నా జాగ్రత్త..ఎయిర్ పొల్యూషన్‌తో గుండెపోటు ముప్పు!

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు హాట్ టాపిక్. రాజధాని ఢిల్లీలో పాటు  అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటివరకు వాయుకాలుష్యంతో  ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతున్నాయని అనుకుంటుంటే.. ఎయిర్ పొల్యూషన్ తో ఇ ప్పుడు ప్రాణాంతకమైన గుండెపోటుకు ప్రధానకారణంగా మారుతుందని డాకర్లు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.  
 
చాలా సంవత్సరాలుగా గుండెపోటుకు పొగతాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర వంటి జీవనశైలి సమస్యలే కారణంగా చెబుతున్నా.. ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలకు ఎయిర్ పొల్యూషన్ కూడా కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 

ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో కూడా ఎయిర్ పొల్యూషన్ తో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ కారణంగా రక్త నాళాలు నిశ్శబ్దంగా దెబ్బతింటాయని దీంతో ఎప్పుడు జబ్బుపడని వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో కూడా వాయుకాలుష్యం తీవ్రమైన రక్తనాళ సమస్యలను తెచ్చిపెడుతుందని, తద్వారా కార్డియాక్ అరెస్టులకు దారి తీస్తుందని జైపూర్ లోని మణిపాల్ ఆస్పత్రి లో ఇంటర్నేషల్  కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ హిమాన్షు గుప్తా చెబుతున్నారు. 

చాలామంది బాగా తింటున్నప్పటికీ , క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్నటికీ, పొగతాగనప్పటికీ చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. దీనికి కారణం ఎయిర్ పొల్యూషన్ అని నిర్దారించబడిన తర్వాత..ఈ విషయం విని చాలా మంది రోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

రక్తనాళాలను  పొల్యూషన్  ప్రభావితం చేస్తుంది..డాక్టర్లు

వాయు కాలుష్యం ఊపిరితిత్తులోనే ఆగదు.పొల్యూటెడ్ ఎయిర్ ను మనం పీల్చుకున్నప్పుడు సూక్ష్మకణం పదార్థం(PM2.5), నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉండటంతో అవి రక్తంలో కలుస్తాయి.ఇవి ఆక్సీకరణకు దారి తీసి రక్తనాళాల్లో సున్నిత మైన పొర ఎండోథెలియం దెబ్బతిని వాపును కలిగిస్తాయి.దీంతో రక్తనాళాలు సరిగా సంకోచ వ్యాకోచం చెందకుడా ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఈ మార్పులు గుండె పోటు ప్రమాదానికి దారి తీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 

వాయు కాలుష్యం నుంచి గుండెను రక్షించుకోవడం ఎలా?

నిత్యం బయటి తిరిగే వారికి వాయుకాలుష్యానికి దూరం ఉండటం సాధ్యంకాదు.. కానీ ఎయిర్ పొల్యూషన్ లో తిరిగిన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని మార్గాలు సూచిస్తున్నారు డాక్టర్లు. N95, KN95 వంటి స్పెషల్ మాస్కులను ధరించడం ద్వారా కొంతవరకు ఎయిర్ పొల్యూషన్ ప్రభావాన్ని పరిమితం చేయొచ్చంటున్నారు. 

ఇండ్లు , ఆఫీసుల్లో గాలి నాణ్యత పెంచుకోవడం చాలా ముఖ్యం.. ఇందుకోసం ఎయిర్ ప్యూరిఫయర్లను వాడాలని డాక్లర్టు సూచిస్తున్నారు. ఇండస్ట్రీయల్ ఏరియా, రద్దీగా ఉండే రోడ్ల ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి ఇది చాలా ముఖ్యం. 

ఇక ఆహారానికి విషయానికి వస్తే.. ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకునే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు, పండ్లు, తాజా కూరగాయల వంటి గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యనుంచి బయటపడొచ్చంటున్నారు.

ఇక షుగర్, బీపీ, గుండెజబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారికి  తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ అవసరమని చెబుతున్నారు డాక్టర్లు.