కార్పొరేటర్‌‌‌‌ మురళిని చంపింది వినయ్‍ భాస్కరే..ఆరు మర్డర్లు చేయించిండు:నాయిని రాజేందర్‍రెడ్డి

కార్పొరేటర్‌‌‌‌ మురళిని చంపింది వినయ్‍ భాస్కరే..ఆరు మర్డర్లు చేయించిండు:నాయిని రాజేందర్‍రెడ్డి
  • ఆయన ఆరు మర్డర్లు చేయించిండు
  • అతడిపై పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టాలె.. 
  • నగర బహిష్కరణ చేయాలే
  • వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే 
  • నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు : ‘గ్రేటర్‌‌‌‌ వరంగల్‍కు చెందిన బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్‍ అనిశెట్టి మురళిని చంపింది మాజీ ఎమ్మెల్యే వినయ్‌‌‌‌ భాస్కరే, ఇది ఒక్కటే కాకుండా వడ్డేపల్లిలో ముస్లిం నేత పాషా, మరో గౌడ్‍తో కలిపి మొత్తంగా ఆరు మర్డర్లు చేయించాడు’ అని వరంగల్‌‌‌‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆరోపించారు. 

నగరంలోని నాలుగో డివిజన్‌‌‌‌ బీఆర్‍ఎస్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ బొంగు అశోక్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఆదివారం స్థానిక యాదవనగర్‌‌‌‌లో నేతుల రఘు, నేతుల లక్ష్మణ్‍పై హత్యాయత్నం చేశాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని, రౌడీషీట్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేయాలని ఎమ్మెల్యే నాయిని సోమవారం వరంగల్‍ సీపీ సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

మాజీఎమ్మెల్యే వినయ్‍భాస్కర్‍ పదేండ్ల బీఆర్‍ఎస్‍ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, గుండాయిజాన్ని మాత్రం ప్రోత్సహించారని ఆరోపించారు. అప్పట్లో యువనేత పవన్‍ మొదలు.. ఇప్పుడు యాదవ నగర్‍ ఘటన వరకు వినయ్‍ భాస్కర్‍ రౌడీయిజం ఎక్కువైందన్నారు. తాము మంచితనంతో ముందుకెళ్తుంటే.. దానిని అసమర్థతగా భావిస్తున్నారన్నారు.

 తానేమో భద్రకాళి చెరువు, మాడవీధుల అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌ చేస్తుంటే.. ప్రతి పనిలో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారంలోగా వినయ్‌‌‌‌భాస్కర్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే మమ్ములను ఒక అరంగట వదిలేస్తే వినయ్‌‌‌‌భాస్కర్‌‌‌‌ గుండాయిజాన్ని క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ చేస్తామన్నారు. తనకు రాజకీయాల్లేకున్నా పర్లేదు కానీ కార్యకర్తల జోలికొస్తే బడితపూజ తప్పదని హెచ్చరించారు.