- భర్త మృతి.. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు
చేవెళ్ల, వెలుగు: ఓ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబం మొత్తాన్ని ఆగం చేసింది. ఈ ప్రమాదంలో భర్త చనిపోగా.. ఆయన భార్య, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం పూలపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ (35) , భార్య రాణి (30), కుమార్తె(4) తో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బైక్ పై చేవెళ్ల మండలం ఎన్కేపల్లి వైపు నుంచి పూలపల్లి గ్రామానికి బయలుదేరారు. తంగడ్ పల్లి సమీపంలో ముందు వెళ్తున్న ఎడ్ల బండికి ఢీకొనగా ముగ్గురు కిందపడి పోయారు. ఈ ప్రమాదంలో భాస్కర్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు అంబులెన్స్ లో శంకర్పల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
