ట్రేడ్ డీల్ పెండింగ్‌కి ప్రధాని మోడీనే కారణం.. అమెరికా కామర్స్ సెక్రటరీ క్లారిటీ..

ట్రేడ్ డీల్ పెండింగ్‌కి ప్రధాని మోడీనే కారణం.. అమెరికా కామర్స్ సెక్రటరీ క్లారిటీ..

భారత్-అమెరికా మధ్య జరగాల్సిన కీలక ట్రేడ్ డీల్ ఎందుకు ఆగిపోయిందో వివరిస్తూ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమే ఈ ఒప్పందం పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత్‌లో అడుగుపెట్టనున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తాను వాణిజ్య ఒప్పందానికి అన్ని ఏర్పాట్లు చేశానని ఒక ఇంటర్వ్యూలో లుట్నిక్ పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంది. భారత్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ ఫోన్ కాల్ జరగలేదు. దీనివల్ల ఇద్దరు నేతల మధ్య ఉండాల్సిన రాజకీయ సంకేతాలు అందలేదని చెప్పుకొచ్చారు. గతంలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాల నుంచి ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గిందని.. పాత నిబంధనలకు తాము కట్టుబడి లేమని కూడా స్పష్టం చేయటం గమనార్హం.

ALSO READ : లక్కీ ఛాన్స్.. సంక్రాంతి ముందు వెండి రేటు పతనం..

ఈ వ్యాఖ్యలు రావటానికి జస్ట్ ఒక రోజు ముందే.. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించేలా రూపొందించిన రష్యా శాంక్షన్స్ బిల్ కు ట్రంప్ ఆమోదం తెలిపారు. దీని కింద రష్యా నుంచి క్రూడ్, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా ఏకంగా 500 శాతం సుంకం విధించే అవకాశం ఉంది. ఇదంతా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే అంటోంది యూఎస్. దీనివల్ల రష్యాకు యుద్ధం చేసేందుకు నిధులు సమకూరవని ట్రంప్ భావిస్తున్నారు.

ALSO READ : జనవరి13న అమాగి మీడియా ఐపీఓ

మరోవైపు.. ట్రంప్ విధిస్తున్న సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఒకవేళ ఈ టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పునిస్తే.. అమెరికా ప్రభుత్వం దిగుమతిదారులకు దాదాపు 150 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.12లక్షల 60వేల కోట్లు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. మెుత్తానికి రష్యాపై ఆధారపడటం తగ్గించడమే తమ 'టాప్ ప్రయారిటీ' అని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. చూడాలి కోర్టులు దీన్ని ఎంత వరకు సమర్థిస్తాయో అన్నది.