Actress Ramya: పురుషుల మనస్తత్వాన్ని వీధి కుక్కలతో పోల్చిన రమ్య.. హీరోయిన్ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్!

Actress Ramya: పురుషుల మనస్తత్వాన్ని వీధి కుక్కలతో పోల్చిన రమ్య..  హీరోయిన్ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్!

కన్నడ నటి, మాజా ఎంపీ రమ్య  మరో సారి వార్తల్లో నిలిచారు.  వీధి కుక్కల బెడదపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్  ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. కుక్కల మనస్తత్వాన్ని పురుషల నేర ప్రవృత్తితో పోల్చడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై ఇటీవల సుప్రీంకోర్ట్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం .. ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో ఎవరు ఊహించలేరు. వాటి మనస్తత్వాన్ని చదవడం అసాధ్యం అని వ్యాఖ్యానించింది. అలాగే మనుషుల్లో భయాన్ని కుక్కులు పసిగడతాయని.. అప్పుడు అవి మరింత అగ్రెసివ్ గా ప్రవర్తిస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

రమ్య వివాదాస్పద పోస్ట్!

అయితే ఈ వ్యాఖ్యలపై నటి రమ్య తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రియాక్ట్ అయింది. ఒక మనిషి మనసుకు కూడా మనం చదవలేం కదా.. అతను ఎప్పుడు అత్యాచారం చేస్తాడో.. ఎప్పుడు హత్య చేస్తాడో మనకు తెలియదు.  అని అని అంచనా వేయలేమనే కారణంతో పురుషులందరినీ జైల్లో పెడదామా? అని ప్రశ్నించింది. ఈ పోస్ట్ తో రమ్య వీధి కుక్కల సంరక్షణను సమర్థించడమే కాకుండా.. పరురుషులను కుక్కలతో పోల్చడం వివాదానికి దారితీసింది. అంతే కాకుండా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోస్ట్ చేసినట్లైంది.

నెట్టింట రేగుతున్న ఆగ్రహం..

రమ్య పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది. కుక్కల ప్రవర్తనకు, మనుషులు చేసే నేరాలకు సంబంధం ఏంటి? నేరాల వెనుక ఉద్దేశం (Intent), బాధ్యత ఉంటాయి. కుక్కలకు అవి ఉండవు. ఇలాంటి పోలిక తెచ్చి రమ్య పురుషులందరినీ కించపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. మరో వైపు రమ్య చేసిన వ్యాఖ్యలను కేవలం ఒక లాజిక్ కోణంలోనే చూడాలని ఆమె అభిమానులు అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ముందస్తు ఊహతో ఒక వర్గంపై లేదా జంతువులపై సామూహిక చర్యలు తీసుకోవడం తప్పు అని చెప్పడమే ఆమె ఉద్దేశమని వారు వాదిస్తున్నారు.

సుప్రీంకోర్టు సీరియస్.. 

నిజానికి ఈ వివాదం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి. గత 20 రోజుల్లో ఇద్దరు న్యాయమూర్తులు హైవేలపై వీధి జంతువుల కారణంగా ప్రమాదానికి గురయ్యారని, ఒకరికి వెన్నెముక గాయమైందని కోర్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ వైఫల్యం వల్లేఈ సమస్య తీవ్రమవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.